Thursday, 18 March 2010

ఎప్పటిలాగే...

అయ్యా!
నీవు ఈలోకానికి
దూరమయ్యావని తెలిసికూడా...   
ఎప్పటిలాగే ఆరోజు 
సూర్యుడు ఉదయించాడు 
అస్తమించాడు
మనసులేని మనిషిలే క్షమించు.
ఎప్పటిలాగే
ఆ సంధ్యాసమయాన
చల్లటిగాలి
నాహ్రుదయాన్ని తాకి
మంచుగా మార్చేసింది.
దయలేనిగాలిలే దయతో క్షమించు. 
ఎప్పటిలాగే ఆ రాత్రి
పగలంతా నిదురపోయింది
భాదలేని రాత్రిలే భాదపడకు.  

No comments:

Post a Comment